England's David Willey prepares to bowl during play in the fourth One Day International (ODI) cricket match between England and Sri Lanka at The Oval cricket ground in London on June 29, 2016. England captain Eoin Morgan elected to field after winning the toss in the fourth one-day international against Sri Lanka at The Oval on Wednesday. / AFP / OLLY GREENWOOD / RESTRICTED TO EDITORIAL USE. NO ASSOCIATION WITH DIRECT COMPETITOR OF SPONSOR, PARTNER, OR SUPPLIER OF THE ECB (Photo credit should read OLLY GREENWOOD/AFP/Getty Images)

ఇంగ్లండ్ పేస్ బౌలర్ డేవిడ్ విల్లే త్వరలో ఐపిఎల్ ఫ్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరనున్నాడు.  రెండు సంవత్సరాల తరువాత ఐపీఎల్లో పునఃప్రవేశం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేదార్ జాదవ్ రూపంలో తీరిక ఆటగాడిని కోల్పోయింది.

అతను ముంబై ఇండియన్స్ పై జరిగిన తొలి మ్యాచ్లో హామ్స్ట్రింగ్ గాయం పాలయ్యాడు. అయితే చివరిలో అన్ని వికెట్లు పడిపోయిన తరువాత ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు కావలసిన సమయం లో బ్యాటింగ్కు వచ్చి, ఒక సిక్స్ మరియు ఒక ఫోర్ సాధించి చెన్నై సూపర్ కింగ్స్కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు.

అయితే ఆదివారం స్కానింగ్కు వెళ్లిన కేదార్ జాదవ్కు రిపోర్టుల ద్వారా గ్రేడ్ 2 హామ్స్ట్రింగ్ గాయం పాలైనట్టు తెలిసింది. తొలుత అతను ఒక రెండు వారాల్లో తిరిగి ఐపీఎల్ కు వస్తాడని అభిమానులు ఆశించగా, రిపోర్టులు వచ్చిన తరువాత మరలా అతను కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని తెలుస్తోంది.

అయితే అతని స్థానంలో రిప్లేస్మెంట్ గా వస్తున్న డేవిడ్ విల్లే ఈ ఏడాది ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్న పన్నెండు వ ఆటగాడు కావడం విశేషం. అతన్ని బేస్ ప్రైస్ రెండు కోట్లకు చెన్నై జట్టు కొనుక్కున్నట్టు తెలుస్తుంది.

చెన్నై జట్టు ఐపిఎల్ ప్రారంభానికి ముందు నుండి చాలా గాయాల సమస్యలతో బాధపడుతోంది. తొలుత న్యూజిలాండ్ స్పిన్నర్ మిచల్ సాంట్నర్ గాయంతో  దూరం కాగా, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఇంకా తన గాయం నుండి కోలుకోలేదు.

అయితే తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్, మంగళవారం ఎంఎ చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి హోం మ్యాచ్ లో కూడా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.

అయితే వారి ప్రత్యర్థి కోల్కతా నైట్ రైడర్స్ కూడా సంచలన ఫామ్లో ఉండటంతో, ఈ మ్యాచ్పై అభిమానుల ఆసక్తి బాగానే ఉంది.

SHARE